calender_icon.png 5 February, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివాలా కంపెనీకి ధమాకా!

05-02-2026 01:37:20 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ కేఎల్‌ఎస్‌ఆర్‌కు రూ. 6 వేల కోట్ల పనులు
  2. ఈ కంపెనీపై ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు 
  3. సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని కేంద్రానికి ఆదేశాలు 
  4. ఈ అంశాన్ని దాచేందుకే సిట్ పేరిట విచారణ డ్రామాలు 
  5. సీఎం వాడుతున్న కారు కూడా ఆ కంపెనీ పేరిటే
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ పనులు, రహదారుల పనులు అన్నీ కలిపి సుమారు 6 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులను కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ ఎలా పొందిందో సీఎం సమాధానం చెప్పాలి. సీఎం ఆధ్వర్యంలోని పురపాలక శాఖతో పాటు సీఎం నియోజక వర్గంలో ఈ కంపెనీ భారీగా పనులు దక్కించుకున్నది.

 బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన బినామీ కంపెనీ అయిన కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా టెక్ కంపెనీకి దోచి పెడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించా రు. కేఎల్‌ఎస్‌ఆర్ అనే కంపెనీ మొదటినుంచి రేవంత్‌రెడ్డికి బినామీ కంపెనీగా వ్యవహరిస్తున్నదని ఆయన తెలిపారు.

అయితే తాజాగా ఈ కేఎల్‌ఎస్‌ఆర్ కంపె నీ న్యాయమూర్తులను సైతం మేనేజ్ చేయాలనుకున్న విషయం మొదలుకొని, దివాలా తీసిన కంపెనీలో కొనసాగుతు న్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరపడంపైన నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు వారం కింద కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. తన బినామీ కంపెనీ, తన అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ నుంచి సిట్ విచారణ పేరుతో డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు.

కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును సీఎం అయిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి వాడుకున్నారని తెలిపారు. ఈ కంపెనీ పైన 2018లోనే ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ దాడులు చేసిందని, అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందన్నారు. అయితే రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దివాలా తీసి ఎన్‌సీఎల్‌టీలో దివాలా ప్రక్రియ కేసు నడుస్తున్న ఈ కంపెనీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నారని ఆరో పించారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి, రేవంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, అనుబంధం, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అను చిత లబ్ధి.. కట్టబెట్టిన వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల అంశాన్ని వివరించారు. కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డికి ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తున్నదో తమవద్ద ఆధారాలున్నాయన్నారు. 

రేవంత్‌రెడ్డి బినామీ సీఎం..

2018 సెప్టెంబర్ 27 తేదీన రేవంత్‌రెడ్డి బంధువులపైన ఐటీ దాడులు జరిగాయని, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ మధ్య నిధులు చేతులుమారిన విషయాన్ని, టాక్స్ ఎగవేతలను ఈ దాడుల సందర్భంగా గుర్తించినట్టు తెలిపారు. భూపా ల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయని, ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలను విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్‌గా పనిచేశారని, ఇప్పుడు ఆయన స్వయంగా ఢిల్లీ నేతలకు బినామీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రెండు సంవత్సరాల కాలంలో అనేక కుంభకోణాలను ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేస్తూ, ప్రతి అంశంలోనూ రేవంత్‌రెడ్డి దాటవేత ధోరణితో వ్యవహరించారన్నారు. ఈ కేఎల్‌ఎస్‌ఆర్ అనే కంపెనీ 23 జూలై 2023 వ సంవత్సరంలో ఏఎస్‌ఎంఈటీ అనే కంపెనీ మధ్య గొడవ జరిగిందని, వారిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను అప్రోచ్ అయ్యారని, ఆ తర్వాత కేసు నడుస్తున్నదని తెలిపారు.

ఆ తర్వాత ఈ కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ వేసి దివాలా తీసిన విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, దాంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్‌సీఎల్‌టీ నిషేధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ఎన్‌సీఎల్‌టీలో జరుగుతున్న ఈ కేసు విషయంలో ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తి ద్వారా జస్టిస్ శరత్‌కుమార్ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి, ఆ కేసు నుంచి తప్పుకున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే ఎన్‌సీఎల్‌టీలోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలం గా తీర్పు వచ్చేలా నిలబడిన వ్యక్తి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. 

కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీలో రేవంత్‌రెడ్డికి అనేక పెట్టుబడులు పెట్టాడని, అందుకే రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో లావాదేవీలు నడిపిందన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బు లు పంపి దాని నుంచి భారీగా భూములు కొనుగోలు చేసే పనిచేసిందని తెలిపారు. 2018 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈ కంపెనీ మీద దాడి చేసి అనేక ఆధారాలు బయటపెట్టారన్నారు.

దాపరికం కమీషన్ల కోసమా.. భాగస్వామ్యం కోసమా?

తాము ఆధారాలతో సహా ఈ 6,000 కోట్ల రూపాయల స్కామ్‌తో పాటు కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి సంబంధించిన అవకతవకల పైన, రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చిన అనుచిత లబ్ధిపైన దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రానికి ఇచ్చిన నోటీసులను ఎందుకు సీఎం దాచి ఉంచారన్న విషయాన్ని కేటీఆర్ ప్రశ్నించా రు. ఒక దివాలా తీసిన కంపెనీపైన రేవంత్‌రెడ్డికి ఎందుకు ఇంత అమితమైన ఆసక్తి ఉన్నదని, ఇది కేవలం కమిషన్ల కోసమా లేక భాగస్వామ్యం కోసమా లేక అక్రమ సంపాదన ఆ కంపెనీ ద్వారా పంపించుకోవడాని కా, లేకుంటే ఆ కంపెనీ స్వయంగా రేవంత్ రెడ్డిదా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉన్నదని, ఈ అంశంపైన రేవంత్‌రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలి అన్నారు.

వెంటనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రాష్ట్రం లో సీబీఐతో ఈ అంశంలో విచారణను నిష్పాక్షికంగా జరిపించాల్సిన అవసరం ఉం దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి రాష్ట్రం లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్టు లో పెట్టి నూతన కాంట్రాక్టుల్లో పాల్గొనకుం డా బ్లాక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే సీబీఐ, ఈడీ ద్వారా విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశా రు. ఈ మొత్తం వ్యవహారంలో కిషన్‌రెడ్డి స్పందించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు నోటీసులను పక్కన పెట్టి మరి కిషన్‌రెడ్డి, బీజేపీ పార్టీ రేవంత్‌రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారం కేవలం అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం మాత్రమే కాకుండా మనీ లాండ రింగ్ మీద కూడా సీఎం పాత్ర ఉందని, ఈ అంశం పైన కేంద్ర ఏజెన్సీలు విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తు తం తాము అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ విషయంలో సమగ్ర విచారణ జరిపేదాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 

రూ.వేల కోట్ల ప్రాజెక్టులు..

దివాలా తీసిన కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి రేవంత్‌రెడ్డి హయాంలో 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చాయని, అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగా ణ సాగునీటి ప్రాజెక్ట్ పనులు, రహదారుల పనులు అన్నీ కలిపి సుమారు 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కులను ఆ కంపె నీ ఎలా పొందిందో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ని పురపాలక శాఖతో పాటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కంపెనీ భారీగా పను లు దక్కించుకున్నదన్నారు.

అయితే 2023 నుంచే దివాలా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ ప్రభు త్వం కాంట్రాక్టులు ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేఎల్‌ఎస్‌ఆర్ అనే కంపెనీ తమ ఉద్యోగుల కు జీతాలు ఇవ్వడానికి  కూడా డబ్బులు లేక బ్యాంకుల నుంచి రూ.15 లక్షలు అప్పు గా తీసుకున్నదని, అంతటి ఆర్థిక వనరులు లేని కంపెనీ వేల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టులకు సంబంధించిన వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలను ఎందుకు, ఏ విధంగా సబ్మిట్ చేస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, ఆ మేరకు జడ్జిని ప్రభావితం చేసే అంశంతో పాటు ఈ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధుల విషయం పైన విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించిందని కేటీఆర్ తెలిపారు.

అందులోనే భాగంగానే సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌ఎఫ్‌ఐవో), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ) మూడు ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని రాష్ట్రాన్ని కోరుతూ నోటీసు కూడా ఇచ్చిందని చెప్పా రు. అయితే ఈ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తనతో పాటు పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు, పార్టీ అధినేత కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ నోటీసుల పేరిట కవర్ డ్రైవ్ లు, డ్రామాలు ఆడారని అన్నారు.