9 May, 2026 | 9:16 PM

Breaking News

మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •   లాడ్జి యజమానులకు పోలీసుల అవగాహన సదస్సు: ఎస్పీ రోహిత్ రాజ   •  

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

09-05-2026 08:08 PM

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదన్న ఎస్సై

పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో మంజీరా నది నుంచి శుక్రవారం అర్థరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ట్రాక్టర్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.