17 July, 2026 | 1:34 AM

ఆదిలాబాద్‌లో అవినీతి అధికారులు

17-07-2026 01:22 AM
  1. ఫౌల్ట్రీఫాం ఎన్‌ఓసీ కోసం 60 వేల లంచం డిమాండ్
  2. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
  3. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, ఏఈ రమేష్ అరెస్టు

ఆదిలాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఆదిలాబాద్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను గురువారం పట్టుకున్నారు. సోనాల పరిధిలో పౌల్ట్రీ ఫారం పెట్టుకునేందుకు ఇరిగేషన్ శాఖ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) అవసరముండటంతో ఆదిలాబాద్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌లను బాధితుడు సంప్రదించాడు.

మొదట సదరు అధికారులు బాధితుడి వద్ద లక్ష డిమాండ్ చేసి, రూ.60 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. గురువారం బాధితుడి నుంచి డబ్బును తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.60వేలతో పాటు ఈఈ రాథోడ్‌విఠల్, ఏఈ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడి జరిగిన వెంటనే ఏసీబీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌లో ఉన్న రాథోడ్ విఠల్ నివాసంలో ఏసీబీ సెంట్రల్‌జోన్ బృం దం సోదాలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.