17 July, 2026 | 2:44 AM

‘కల్మా’ వివాదం

17-07-2026 02:27 AM
  1. సైదాబాద్ సక్సెస్ పాఠశాలలో మతపరమైన హోంవర్క్ 
  2. కల్మా, సురా ఫాతిహా చదవాలంటూ రెండో తరగతి 
  3. హిందూ విద్యార్థికి డైరీలో హోంవర్క్ ఇచ్చిన టీచర్ 
  4.  విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన
  5. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు, ఏబీవీపీ మండిపాటు

* ఇలాంటి హోంవర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకరమైన విషయం. సైదాబాద్‌లో హిందూ విద్యార్థులకు కల్మా నేర్పిస్తున్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నాయకులు కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నారు?. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి. తప్పుచేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలపై తగినమూల్యం చెల్లించుకోక తప్పదు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

* సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.  హిందూ సమాజమంతా ముక్తకంఠంతో దీనిని ఖండించాలి. చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. తెలంగాణ అంతటా ఈ వ్యవహారం విస్తరించే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ ఆటో డ్రైవర్ భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్ధులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం. 

 కేంద్రమంత్రి బండి సంజయ్

ఇది కాంగ్రెస్ మార్క్ ఎడ్యుకేషన్ జిహాద్. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ రేవంత్‌రెడ్డి చేసిన.. ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి తీవ్రవాద ఆలోచనలు ఉన్న శక్తులకు తెగింపు పెరిగింది. కొన్ని కాన్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని రాకూడదని ఒత్తిడి చేస్తూ మతాచారాలకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి.

 బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థికి ‘కల్మా’, ‘సురా ఫాతిహా’ చదవాలని టీచర్ హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదవుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇచ్చిన ఆ హోంవర్క్‌ను చూసి న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యా న్ని నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బీజేపీ నేతలు,  హిందూ సంఘాలు, ఏబీవీపీ తీవ్రంగా మండిపడ్డాయి.

సైదాబాద్‌లోని సక్సెస్ అనే ప్రైవేట్ పాఠశాలలలో రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ‘కల్మా’ చదవాలని, ‘దీనియాత్’ (ఇస్లామిక్ బోధన) సబ్జెక్టు కింద ‘సురా ఫాతి హా’ చదవాలని స్కూల్ డైరీలో టీచర్ హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. అయితే డైరీలో అంతకుముందు కల్మా చదవాలని రాసి, ఆ విద్యార్థి ముస్లిం కాదని ఆ తర్వాత గ్రహించిన టీచర్ దానిని కొట్టివేసినట్లు గా తెలిసింది.

కానీ సురా ఫాతిహా కూడా చదవాలని డైరీలో రాసి ఉండడంతో వివాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఎంతవరకు సమంజసమని నిరసన తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తున్నది.

సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ తరగతిలో 25 మంది విద్యార్థుల్లో 24 మంది ముస్లింలు, ఒకరు మాత్రమే హిందూ విద్యార్థి ఉన్నారు. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతా నికి సంబంధించిన సురాలను హోంవర్క్‌గా ఇవ్వడం ఈ వివాదానికి కారణ మైంది. ఇలాంటి హోంవర్క్ ఇవ్వడం విద్యా విధానం, పాఠశాల విధానాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, తమ పాఠశాలలో ఎలాంటి మతపరమైన బోధనలు నిర్వహించడం లేదని ఆ స్కూల్ యాజమాన్యం తెలిపింది. తమ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారని, వారికి ‘దీనియాత్’ సబ్జెక్టు ఉంటుందని, అయితే ఆ సబ్జెక్టును ఇతర మ తాల విద్యార్థులకు బోధించబోమని యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు, విద్యాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థికి కల్మా, సూరా అ ల్  నేర్చుకుని రావాలని హోంవర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకరమైన విషయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యా సంస్థలు విద్యను బోధించాల్సిందే తప్ప, ఏ విద్యార్థిపైనా మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేద న్నారు. బుధవారం ఎక్స్ వేదికగా కేంద్రమం త్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు.

మొన్నటికి మొన్న ఆర్మూరులో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పిస్తారని, ఇదేంటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. నిన్నటికి నిన్న అత్తాపూర్‌లో ఆటో వెనక దేవుడి కొటేషన్ రాసుకున్న హిందువును.. ఒవైసీ, మజ్లిస్ పార్టీ నాయకులు బెదిరించి, భయబ్రాంతులకు గురిచేశాయని తెలిపారు. ‘నే డు.. సైదాబాద్‌లో హిందూ విద్యార్థులకు కల్మా నేర్పిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ప్రభుత్వం కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నారు. ఇ లాంటి దుర్మార్గమైన ఘటనలపై రాష్ట్ర ప్రభు త్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పాఠాల బోధనపై ప్రభుత్వం ప్రత్యే క నిఘా పెంచాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగబద్ధమైన మత స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్క విద్యాసంస్థ బాధ్యత అని, అలా కాకుండా.. మతాంతరీకరణ చే స్తాం.. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉందని ఎవరైనా ప్రయత్నిస్తే.. చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని, దీనికి తగినమూల్యం చెల్లించుకోక తప్పదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

బొట్టు తప్పనిసరి చేస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్

బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కల్మా, సురా ఫాతి హా చదవాలని హుకుం జారీచేయడం దు ర్మార్గమన్నారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని, హిందూ విద్యార్ధులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సం స్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు ఇప్పుడు ఎందుకు నో రు మెదపడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. హిందూ సమాజమంతా ముక్తకంఠం తో దీన్ని ఖండించాలన్నారు. సైదాబాద్ సక్సె స్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. తెలంగాణ అంత టా ఈ వ్యవహారం విస్తరించే ప్రమాదం ఉం దని తెలిపారు.

అలాగే ఇటీవల ఓ ఆటో డ్రైవర్ భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లి స్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. ఆటో వెనుక భరత్ రాసిన దాంట్లో తప్పేముందని నిలదీశారు. హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోల్లో, గో డలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. వాళ్లకో న్యాయం? భరత్‌కు ఇంకో న్యాయమా? అని బండి సంజయ్ నిలదీశారు. 

ఎడ్యుకేషన్ జిహాద్: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

కాంగ్రెస్ మార్క్ ‘ఎడ్యుకేషన్ జిహాద్’పై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ‘ఎడ్యుకేషన్ జిహాద్’ తారాస్థాయికి చేరిందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

ఆ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థి చేత కల్మా చదివించి, హోంవర్క్‌గా కల్మా, ‘సూరా అల్- నేర్చుకు ని, పుస్తకాల్లో రాసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఈ దుశ్చర్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే పూర్తి బాధ్యత వహించాలని, కాంగ్రెస్ అంటే ము స్లింలు..

ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ ఆయన చేసిన ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి తీవ్ర వాద ఆలోచనలు ఉన్న శక్తులకు తెగింపు పెరిగిందని ఆయన మండిపడ్డారు. తన రెం డవ తరగతి బిడ్డ చేత బలవంతంగా కల్మా రాయించడాన్ని గమనించి, ధైర్యంగా పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన ఆ చిన్నారి తల్లి సాహసాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

ఇంతటి తీవ్ర మైన ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సదరు పాఠశాల యాజమాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గ మన్నారు. కేవలం ఒక ముస్లిం టీచర్‌ను బా ధ్యత నుంచి తప్పిస్తే సరిపోదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యాని దేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని, హిందూ విద్యార్థులు, వారి కు టుంబాల భద్రత, ఆత్మగౌరవంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కళ్ళు మూసుకుని వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

హిం దూ విద్యార్థులపై వారి మతానికి సంబంధం లేని ప్రార్థనలు, కల్మాలు బలవంతంగా రుద్ద డం ఏమాత్రం సహించబోమని, కొన్ని కా న్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొ ట్టు పెట్టుకుని రాకూడదని ఒత్తిడి చేస్తూ మతాచారాలకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యా సంస్థ లు విద్యను అందించాలి తప్ప, విద్యార్థులపై ఏ మతాన్నీ రుద్దే హక్కు ఎవరికీ లేదని, ప్రతి విద్యార్థి రాజ్యాంగ హక్కును గౌరవించాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉందన్నారు.

ఈ ‘ఎడ్యుకేషన్ జిహాద్’ ఉదంతాన్ని బీజేపీ తీవ్రం గా ఖండిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంట నే నిష్పాక్షికమైన, సమగ్రమైన దర్యాప్తు జరిపి, పాఠశాల యాజమాన్యంతో పాటు ఈ ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయా లని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

మతమార్పిడికి ప్రయత్నాలు: ఎమ్మెల్యే రాజా సింగ్

రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఇస్లాం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపిం చారు. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే సం బంధిత పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండో తరగతి విద్యార్థిపై ‘కల్మా’ చదవాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేయడం సిగ్గుచేటని అన్నారు.

తెలంగాణలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని, గతంలోనూ జరిగాయన్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో ఇదంతా భాగమని ఆయన ఆరోపించారు. హిందూ విద్యార్థులను బలవంతం చేస్తున్న ఇలాంటి పాఠశాలలు, ఉపాధ్యాయులపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని జైలుకు పంపాలన్నారు.  ఈ విషయంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. 

అవి మతమార్పిడి కేంద్రాలు: ఏబీవీపీ

పాతబస్తీలోని సక్సెస్ స్కూల్‌లో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి హోమ్ వర్క్ లో భాగంగా కల్మా, సురా ఫాతిహా రాయాలనడం చూస్తుంటే అవి పాఠశాలల, అక్రమ మతమార్పిడి కేంద్రాలా? అనే సందేహం కలుగుతుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పేర్కొన్నారు. ఏ సిలబస్‌లో కల్మా బోధించాలని, రాయించాలని ఉందో విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి ఘటనలు మొదటివి ఏం కాదని, గతంలో మైనారిటీ గురు కులాల సెక్రెటరీ షఫీవుల్లా అధికారికంగా విద్యార్థులు ప్రార్థన సమయంలో కల్మా చదవాలని సర్క్యులర్ జారీ చేశారని ఆరోపిం చారు.

ప్రభుత్వ నిధులతో మత మార్పిడికి మైనారిటీ గురుకులాలు పని చేస్తున్నాయని, మైనారిటీ గురుకులాలల్లో కేవలం ముస్లిం మైనారిటీలే కాకుండా ఇతర మైనారిటీలు, హిందూ పిల్లలు కూడా చదువుతారని అన్నా రు. ఇప్పుడు ఈ ఇది కాస్త ప్రైవేట్ పాఠశాలలకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తుంద న్నారు. విద్యాశాఖలో ఇంత జరుగుతున్న విద్యాశాఖ మంత్రి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సక్సెస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరారు.