17 July, 2026 | 9:50 AM

బైక్ దొంగ అరెస్టు.. చోరీ చేసిన వాహనం స్వాధీనం

09-05-2026 08:07 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): బైక్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, చోరీ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25-01-2026న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నాలుక శంకర్ తన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ (నంబర్: TS23D3211)పై సంధు సాయి కుమార్ (24)కు లిఫ్ట్ ఇచ్చాడు.

అనంతరం బావుసాయిపేట గ్రామంలోని మొబైల్ షాప్ వద్ద బైక్ నిలిపి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, సంధు సాయి కుమార్ చోరీ చేసిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌తో వేములవాడ వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. అనంతరం బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించిన్నట్లు ఎస్ఐ కె ప్రశాంత్ రెడ్డి తెలిపారు.