17 July, 2026 | 3:03 AM

ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ఉండాలి

17-07-2026 02:48 AM

పెండింగ్ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

నిర్మల్ జులై 16 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. గురువారం జిల్లా కలె క్టరేట్ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధి తులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చే పట్టాలని సూచించారు. ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమ స్యలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

సమావేశానికి ముందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం చిత్రపటాలకు చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, కమిషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పక్కలపై ఆ రా తీసి వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేసి బా ధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద జాబ్కార్డు కలిగిన ప్రతి కూలీకి తగిన పని దినాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీ సుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎ స్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి నిధులు ఎక్కడైనా పెండింగ్లో ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదలయ్యేలా కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను వివరించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా , ఎస్పీ జానకిఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, డీఆర్‌ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.