9 May, 2026 | 9:16 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

గుర్తు తెలియని వాహానం ఢీకొట్టి ఐదు పాడి గేదలు మృతి

09-05-2026 08:12 PM

మంగపేట,(విజయక్రాంతి): గుర్తు తెలియని వాహానం ఢీకొట్టడంతో ఐదు పాడి గేదలు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు) మండలం పాత్రాపురం గ్రామ శివారులో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించి  స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపురం (నూగురు) మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన రాంబాబు అనే రైతు గేదేలను మేత కోసం పాలెం వాగు సమీపంలోని పొలాల్లోకి  శుక్రవారం ఉదయం తోలినట్లు తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి గేదలు ఇంటికి రాలేదని తెలిపారు. గేదెలు ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం గేదల కోసం వెతుకుతుండగా చర్ల వెంకటాపురం రహదారిపై పాత్రాపురం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహానం డీ కొట్టగా మృతి చెంది కనిపించాయి.