చికిత్స పొందుతూ బాలుడి మృతి
గత నెల 25న పిచ్చి కుక్క కాటుకు గురైన జీవన్
గద్వాల్ జిల్లా కోనేరు గ్రామంలో
అలంపూర్, మే 21(విజయక్రాంతి): పిచ్చి కుక్క కాటుకు గురై ఓ బాలుడు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటన గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకుగ్రామానికి చెందిన స్వాములు ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపి ల్లలు, ఒక కుమారుడు. ఏప్రిల్ 25న తోటి పిల్లతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటు న్న జీవన్ (7)ను పిచ్చికుక్క తీవ్రంగా కరిచి గాయపర్చింది.
దీంతో చికిత్స నిమిత్తం బాలుడుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఈనెల 17న జీవన్ ఆరోగ్య పరిస్థితి విషమించి తీవ్ర అస్వస్థతకు గురయ్యా డు. గమనించిన కుటుంబ సభ్యులు మరోసారి కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ జీవన్ బుధవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు.తమ కుమారుడు కళ్లేదుటే మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.






