27 June, 2026 | 1:15 AM

డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

27-06-2026 12:00 AM

పిట్లంలో 2 కె రన్

బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య

నిజాంసాగర్, జూన్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో 2 కె రన్ నిర్వహిస్తూ యువతలో చైతన్య జ్యోతి వెలిగించారు. డ్రగ్స్ ను ఆరోగ్యకరమైన జీవితానికి ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐ తిరుపతయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని వివరించారు.

డ్రగ్స్ రైతు సమాజా నిర్మాణ లక్ష్యంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నో టు డ్రగ్స్ నినాదంతో 2 కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్షణికానందం కోసం జీవితాన్నిపరంగా పెట్టవద్దని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్లం ఎస్ హెచ్ ఓ ఆంజనేయులు, సర్పంచ్ చంద్రశేఖర్, తిమ్మానగర్ సర్పంచ్ ప్రవీణ్, పోతిరెడ్డిపల్లి సర్పంచి హెంసింగ్, ప్రజా ప్రతినిధులు, యువత, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.