27 June, 2026 | 2:14 AM

ఆరుగురు అమర జవాన్లు

27-06-2026 12:57 AM
  1. ఆపరేషన్ సిందూర్‌లో మృతుల పేర్లు విడుదల
  2. అధికారికంగా కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ, జూన్ 26: ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన భారత జవాన్లు ఆరుగురి పేర్లను తొలిసారిగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జవాన్ల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఐదుగురు అధి కారులతో పాటు, ఒక అగ్నివీర్‌లు వీరమరణం పొందారు.

సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (భారత సైన్యం), రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, వీరచక్ర (భారత సైన్యం), లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (భారతసైన్యం), ఏవియేషన్ టెక్నీషియన్ మూడ్ మురళీ నాయక్ (భారతసైన్యం)- శ్రీసత్య సాయి జిల్లా కళ్లితండాకు చెందిన తెలుగు వ్యక్తి, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (భారత సైన్యం), సార్జెంట్ సురేంద్ర కుమార్, వాయు పతకం (భారత వైమానిక దళం).

వీరి పేర్లను త్వరలోనే దేశరాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారకం ప్రత్యేక శిలాఫలకంపై చెక్కనున్నారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహెల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే.