చెత్తకుప్ప నుంచి స్కూల్ బోర్డు వెలికితీత
27-06-2026 12:42 AM
బెజ్జంకి, జూన్ 26: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల సూచిక బోర్డు చెత్తకుప్పలో నిర్లక్ష్యంగా పడివుం డటంపై విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు, పా ఠశాల సిబ్బంది స్పందించారు.శుక్రవారం పాఠశాల సిబ్బంది చెత్తకుప్పలో ఉన్న బోర్డును బయటకు తీసి శుభ్రపరిచి, మరమ్మతులు చేసి తిరిగి ఏర్పాటు చేశారు.
దీంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన విజయక్రాంతికి అభినందనలు తెలిపారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు రావడంలో విజయక్రాంతి మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, విజయక్రాంతి కథనానికి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.






