నారాయణ స్కూల్‌లో తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయం
వనస్థలిపురంలో తనిఖీ చేసిన ఎంఈవో
ఎల్బీనగర్, జూన్ 26: ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్నా రు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు హయత్ నగర్ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ శుక్రవారం వనస్థలిపురంలోని నారాయణ స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పాఠశాల పరిసరాలు, అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని గుర్తించి, పుస్తకాలను నిల్వ చేసిన రెండు గదులను సీజ్ చేశారు. అధిక ఫీజులు, పుస్తకాల ధరలు పెంచే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదం డ్రులపై ఆర్థిక భారం పడకుండా తనిఖీలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.






