5.849 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరి అరెస్ట్
మేడ్చల్, జూన్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆర్ ఆర్ 06 ఎగ్జిట్ , ధృవ కాలేజ్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 5.849 కిలోల గంజే పట్టుబడినట్లు మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 5.849 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన సచిన్ సంతోష్ జాదవ్ అలియాస్ నితిన్ అలియాస్ ఆకాష్ (24 ), రాజేష్ మాధవ్ చౌదరి (22), లు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకు తనిఖీ చేయగా వారి వద్ద నుండి 5.849 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. వీరి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నిందితులను విచారించగా ఒడిశా నుండి ఈ గంజాయిని సేకరించి, అక్రమంగా విక్రయించేందుకు మేడ్చల్కు తరలించినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచామన్నారు. మాదకద్రవ్యాల నెట్వర్క్కు సంబంధించిన మూలాలను ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.






