సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
నాగిరెడ్డిపేట,ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన భామనీళ్ళ బక్కయ్య,బోరంచ నర్సయ్యులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ యాద గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.బామనీళ్ల నరసయ్య 1,75 వేల,,సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా, బోరంచ నర్సయ్యకు 39 వేలు,,చెక్కును మంజూరు కావడంతో వాటిని శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు,గ్రామ మండల కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య,ఉప సర్పంచ్ అభిషేక్,వార్డు మెంబర్లు, గ్రామస్తులు మధు,సిద్దు,శ్రీనివాస్ గౌడ్, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.
16-08-2026