భూ వివాదంలో వేధింపులు
మాజీ ఉప సర్పంచ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- సూసైడ్ నోట్‌లో పోలీసులు, ప్రముఖుల పేర్లు
- సిద్దిపేట జిల్లా దుద్దెడలో విషాదం
కొండపాక, జూన్ 26: భూ వివాదంలో వేధింపులు తాళలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు రాసిన సూసైడ్ నోట్ లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువురు ప్రముఖులు, పోలీసుల పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మా రింది. దుద్దెడ గ్రామానికి చెందిన మాజీ ఉ ప సర్పంచ్, ప్రస్తుత వార్డు సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండెల్లి ఆంజనేయులు (43) గతంలో విక్రయించిన భూమి విషయంలో వివాదం జరుగుతుంది.
కొద్ది రోజు ల క్రితం ఆంజనేయులు తో పాటు భూమి విక్రయించిన 9 మందిపై సిద్దిపేట త్రీ టౌన్ లో కేసు నమోదైంది. పోలీసులు వారిని అరె స్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవలే బెయిలు పై జైలు నుంచి బయటకు వచ్చా రు. ఆంజనేయులు శుక్రవారం ఉదయం త న ఫోన్లను ఇంటి వద్దనే ఉంచి మోటార్ సై కిల్ పై వెళ్లిపోయాడు. భార్య , కూతురు చూ సేసరికి ఆంజనేయులు కనపడకపోవడంతో ఆందోళన గురై తెలిసిన వారిని అడిగారు.
కొద్దిసేపటికి ఆంజనేయులు తన ఫామ్ హౌ స్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడని సమాచారం అందింది. దాంతో భార్య సంధ్యారాణి కూతురు ప్రసన్న లక్ష్మి కుటుం బ సభ్యులంతా వెళ్లి చేసేసరికి అప్పటికే చనిపోయాడు. అక్కడ ఉన్న టేబుల్ పై సూసైడ్ నోటు రాసినట్టు భార్య సంధ్యారాణి ఫిర్యాదు లో పేర్కొంది. సంఘటన స్థలానికి త్రీటౌ న్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
ఆంజనేయులు మృతితో గ్రా మంలో విషాదం ఏర్పడింది. పెద్ద ఎత్తు న 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. అక్కడి నుంచి సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ లో గల ఓ ప్రవేటు పాఠశాల యజమానే కారణమంటూ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు భారీ సం ఖ్యలో ఉండటంతో యజమాని ఇంటికి వె ళ్ళారు. పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను అదుపు చేశారు. భార్య సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






