27 June, 2026 | 2:14 AM

660 ఉక్రెయిన్ డ్రోన్ల కూల్చివేత

27-06-2026 01:11 AM

రష్యా స్పష్టీకరణ

మాస్కో, జూన్ 26: రష్యాపై ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్లతో దాడులకు దిగింది. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా, నల్ల సముద్రం, అజోవ్ సముద్రం మొత్తం 12 ప్రాంతాలపై గురువారం అర్ధరాత్రి దాడులు చేసింది. ఈ దాడులను తిప్పికొట్టామని, ఉక్రెయిన్‌కు చెందిన 660 డ్రోన్లను కూల్చివేశా మని మాస్కో మేయర్  సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా రష్యా మ ధ్య కొనసాగుతున్న దాడుల్లో ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద దాడిగా అధికారులు ధృవీకరించారు.

ఈ దాడుల్లో ఒక కెమికల్ ప్లాంటు, ఒక ఎలక్ట్రిక్ ప్లాంటులో మంటలు చెలరేగా యి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే రష్యాలోని భా రీగా చమురు ఉత్పత్తి కేంద్రాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఇటీవలి కాలంలో ఉక్రెయి న్ రష్యాపై ఆకస్మిక డ్రోన్ దాడులకు ది గుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రష్యా చమురు రంగాన్ని దెబ్బతీసే లక్ష్యంతో దాడులను కొనసాగిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.