అన్న ప్రసాదం.. 500మందికే?
- బాసర నిత్యాన్నదానంపై భక్తుల తిప్పలు
- గంట ముందు క్యూలైన్ అన్న ప్రసాదం
- ఆదాయం పెరిగిన.. సంఖ్య పెంచని అధికారులు
నిర్మల్, జూన్ 26 ( విజయక్రాంతి) : దక్షిణ భారతదేశంలోన ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసరలో అన్న ప్రసాదం పై ఆంక్షలు భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పా టు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే అమ్మవారి ఆలయంలో భక్తులకు ఆలయం ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు 500 భక్తులకు మాత్రమే అన్నప్రసా దం ఉచితంగా అందిస్తున్నారు. ఈ సంఖ్యను పెంచాలని గత ఐదేళ్లుగా ఇక్కడికి వచ్చే భక్తు లు ఆలయ అధికారులకు జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ కమిషనర్ కు విన్నవించిన ఇప్ప టివరకు అన్న ప్రసాదం సంఖ్యను పెంచకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలతో తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో వారికి అక్షరాభ్యాసం చేయించుకుంటారు.
పేద మధ్య తరగతి కుటుంబాల సభ్యులు ఆర్థిక స్తోమత లేని వారు ఇంటి నుంచి అల్పాహారం తెచ్చుకోవడం పనులు తెచ్చుకోవడం మరికొం దరు బాసర ఆలయంలో నిత్యా అన్నదానం పై ఆధారపడి వస్తుంటారు. ఆలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కేవలం 500 మంది భక్తులకు మా త్రమే ఉచిత భోజనాన్ని అన్న ప్రసాదం అందిస్తారు. ఒంటిగంట నుంచి ప్రారంభమై రెండు గంటలకు ముగుస్తుంది.
ఎవరు క్యూ లైన్ లో నిలబడితే వారికి ముందుగా భోజ నం చేసే అవకాశం ఉంటుంది. అతి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు గోదావరిలో స్నానం చేసి అమ్మవారికి పూజలు ఇతర కా ర్యక్రమాలు పూర్తిచేసే వరకు ఒంటిగంట దా టిపోతే ఆ తర్వాత బాసర అమ్మవారి ఉచిత అన్నదాన ప్రసాదానికి నోచుకోవడం లేదు
ఆదాయం వస్తున్న సంఖ్య పెంచరేం
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి ప్రతి ఏడు భక్తుల సంఖ్య పెరిగి ఆదాయ వనరులు పెరుగుతున్న అన్న ప్ర సాదం పై ఇప్పటికీ పాత ఆంక్షలు అని అమ లు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బాసర ఉత్సవాలు పాఠ శాలల పున ప్రారంభం నేపథ్యంలో ప్రస్తు తం భక్తుల మధ్య విపరీతంగా పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్రలోని నాగపూర్ అకోలా ధర్మాబాద్ నాందేడ్ మహారాష్ట్ర క ర్ణాటక తమిళనాడు తదితర సుధీర ప్రాం తాల నుంచి భక్తులు ట్రైన్లు ప్రైవేటు ప్రభుత్వ వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం సరస్వతి మాతా క్షేత్రంలో ప్రభుత్వం అందిం చే నిత్య ఉచిత అన్నదానం ప్రసాదం కోసం క్యూలైన్లు కట్టవలసి వస్తుంది. ప్రస్తుతం అన్నదానం 500 మందికి మాత్రమే పరిమితం చేస్తున్నారు.
సీజన్లో 10,000 నుంచి 40, 000 వరకు భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తుండగా కేవలం 500 మంది మాత్రమే ఉచిత అన్నదాన ప్రసాదాన్ని అందించడం తో అన్నదాన ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడి చివరి దశలో అవకాశం రాకపోవడంతో నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు. ప్రైవే ట్ లో భోజనాలు చేయాలంటే ఆర్థిక భారం తలకు మించిన భారం అవుతుంది. దీనికి తోడు అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాదాన్ని సెంటిమెంట్గా భావిస్తారు.
అన్నం ప్రసాదం తింటే దేవుడి ప్రసాదం తిన్నట్టుగా పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత కుటుంబాల వారు అన్నదానం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేట్ లో సరైన భోజనశాలలు లేకపోవడం ఉన్నవి పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల బాసర ఉచిత అన్నదానం వైఫై భక్తులు మగ్గుచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో బాసర ఆలయ అధికారులు ప్రతిరోజు 500 మందికి అన్నదానం అంటూ మైక్ అనౌన్స్మెంట్లు చేయడం తో తమకు అన్న ప్రసాదం దొరుకుతుందో లేదో అన్న ఆందోళన అక్కడికి వచ్చిన భక్తుల్లో నెలకొంది. అన్న ప్రసాదం కోసం క్యూ లైన్ లో చిన్న పిల్లలతో గంటల తరబడి ముందే నిలబడుతున్నారు. వృద్ధులు చిన్న పిల్లలు గర్భిణీలకు ఇక్కట్లు తప్పడం లేదు. అన్న ప్రసాద సంఖ్యలు ముఖ్యంగా శుక్ర ఆదివారాలు పండుగ వేళల్లో సీజన్లో పెంచాలని భక్తులు కోరుతున్నారు.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ముక్కుల రూపం లో అమ్మవారి కి తోచినంత సాయం చేస్తున్నారు. అన్నదానం కూడా ఆలయ అధికారు లు సాయం కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ అన్న ప్రసాదం తిన్నవారు వారికి తగిన రీతిలో ఆర్థిక సాయం హుండీలో వేస్తారు.
బాసర ఆలయానికి గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతున్నప్పటికీ భక్తులకు అందించే నిత్య అన్నదానం సంఖ్య పెంచకపోవడంపై భక్తులు నిరాశకు గురవుతున్నా రు. అన్నదాన సత్రం చిన్నదిగా ఉండటంతో ప్రతి ట్రిప్పులో 100 మందికి మాత్రమే భోజనం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉచిత అన్నదాన ప్రసాదాన్ని పెంచాలని అన్నదాన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.






