నలుగురిని ఒక్కడే చంపాడు
వీడిన నల్లగొండలో కుటుంబం హత్య కేసు మిస్టరీ
నల్లగొండ క్రైం, జూన్ 26 (విజయక్రాంతి) : నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో జూన్ 22న బయటపడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ వివరాలను వెల్లడించారు. ప్రైవేట్ టీ చర్ హసీనా(41), భర్త సుల్తాన్ (45), పిల్లలు ముజమ్మిల్ (20), అఫ్కూరా (12) లను హ సీనా సొంత అక్క అల్లుడైన అస్లాం ఒక్కడే ఆస్తి కోసం హత్య చేసినట్లు తెలిపారు.
అస్లాం, అతని భార్య తబస్సుం (హసీనా మేనకోడలు) స్నేహితుడు సోహైల్, బంగారం కొన్న జ్యువెలర్స్ యజమాని హేమంత్‌ను నార్కట్‌పల్లి వద్ద పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. జూన్ 20 తెల్లవారుజామున వాష్‌రూమ్ కోసం హసీనా బయటకు రాగా అస్లాం అదే అదునుగా కత్తితో హసీనాను చంపాడు.
సుల్తాన్ బయటికి రాగా అతడ్ని కూడా కత్తితో చంపేశాడు. ముజమ్మిల్ మేల్కొని చిన్న రాడుతో ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. అతన్ని సైతం పొడిచి హత్య చేశాడు. అఫ్కూరా భయపడి మంచం కింద దాక్కున్నప్పటికీ బయటికి లాగి కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుల నుంచి కారు, 3 లక్షల నగదు, 5 తులా ల బంగారం, కత్తి స్వాధీనం చేసుకున్నారు.






