14 May, 2026 | 1:23 AM

అత్యంత వైభవంగా శ్రీహనుమాన్ శోభయాత్ర

14-05-2026 12:33 AM

జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిన ఘట్ కేసర్

ఘట్ కేసర్, మే 13 (విజయక్రాంతి): శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భజరంగ్ దళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో శ్రీహనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు.

శివారెడ్డిగూడాలోని దండ్లగడ్డ శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయం ఆవరణలో పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. శోభయాత్రలో భజరంగ్ దళ్ నాయకులు, సభ్యులు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జైశ్రీరాం, జైహనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ వెంటరాగా బాజాబజంత్రీల చప్పుళ్లతో రహదారి గుండా పట్టణ కేంద్రానికి చేరుకుంది. యాత్ర పట్టణ కేంద్రంలోని ప్రధాన రోడ్లలో కొనసాగింది. శ్రీహనుమాన్ శోభయాత్ర మహోత్సవాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించారు.

శ్రీహనుమాన్ శోభయాత్రను పురస్కరించుకుని భజరంగ్ దళ్ సభ్యులు పట్టణ కేంధ్రంలోని రోడ్లను జైశ్రీరాం, జైహనుమాన్ అంటూ వ్రాసి ఉన్న కాషాయపు జెండాలతో నింపారు. హనుమాన్ జయంతి సందర్బంగా ఘట్ కేసర్ లో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సింగిరెడ్డి రాంరెడ్డి, అబ్బసాని యాదగిరియాదవ్, బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, కొంతం బ్రదర్స్ రామ్ రెడ్డి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, భజరంగ్ దళ్ అధ్యక్షులు పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్, ఉపాధ్యాక్షులు శ్రావణ్, ఉదయ్ కిరణ్, గణేష్ గౌడ్, కార్యదర్శి మహేందర్ యాదవ్ పాల్గొన్నారు.