14 May, 2026 | 1:24 AM

ఎల్లంపేట మున్సిపాలిటీలో విద్యా వారోత్సవాలు

14-05-2026 12:32 AM

ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ విజయకుమారి

మేడ్చల్ అర్బన్, మే 13 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా  విద్యా వారోత్సవాలను నిర్వహించారు. ప్రభుత్వ బడులు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యమనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి వై శంకరయ్య తెలిపారు.అదేవిధంగా విద్య వారోత్సవాలు బుధవారం రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి (ౄEO) విజయకుమారి ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ బోధనను అందిస్తున్నట్లు ఆమే తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారి విజయకుమారి తెలిపారు.

ప్రజా ప్రతినిధులు పాఠశాలను పట్టించుకోని మౌలిక సదుపాయాల కల్పనలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.సమాజం ఒక మంచి పాఠశాలలు తయారు చేస్తే పాఠశాల ఒక మంచి సమాజాన్ని ఇస్తుందని చెప్పారు.మునిసిపల్ చైర్ పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక  సదుపాయాలు అనివార్యంమని ఆమె అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల కొరతను అధికారులు తీర్చాలని చైర్ పర్సన్ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు.ప్రధానోపాధ్యాయులు విజయ భాస్కర్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి ఎం ఆర్ సి సిబ్బంది మల్లేష్ స్థానిక మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.