2 September, 2026 | 11:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ ఎత్తేసే కుట్ర మానుకోవాలి

14-05-2026 | 01:16am

లేకుంటే సీఎం నివాసం ముట్టడిస్తాం

18 బీసీ సంఘాల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నత చదువులు, వృత్తి విద్యా కోర్సులు చదువుకుంటుంటే అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయని, అం దుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమును రకరకాల పద్ధతులకు పాల్పడుతూ జీవో నెంబ ర్ 7ను తెచ్చి ఎత్తివేసే కుట్రకు పాల్పడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించా రు. కుట్రలు మానుకోకపోతే ప్రభుత్వ పత నం తప్పదన్నారు.

18 బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయని గుర్తుంచుకోవా లన్నారు. ఈ మేరకు బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో 18 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ య్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఫీజులు, స్కాలర్ షిప్‌ల బకాయిలు చెల్లించ డం చేతకాని ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రపంచస్థాయికి ఎలా తీసుకువెళ్తారని నిలదీశారు.

బకాయిలు చెల్లించకుండా కోర్టుల ద్వారా కొత్త జీవో తెచ్చి దాన్నీ పక్కదారి పట్టించడంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేసే కుట్రలను మానుకోకుంటే పెద్ద ఎత్తు న సీఎం ఇంటిముందు ధర్నా నిర్వహిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

ఈ సమా వేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ ఐక్య కులాల వేదిక అధ్యక్షుడు జీ అనంతయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సీ రాజేందర్, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు గొరిగి మల్లేష్ యాదవ్, బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు రేగుల మధుసూదన్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అసోసియేషన్ రాందేవ్ మోదీ, బీసీ సంఘాల నేతలు వెంకన్న గౌడ్, కృష్ణుడు, రామాంజనేయులు, నిఖిల్ పటేల్, బర్క్ కృష్ణ, నిమ్మల వీరన్న, జి.కృష్ణ యాదవ్, కూనూరు నరసింహ గౌడ్, టీఆర్ చంద్ర, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.