సెక్యులర్ ఓట్ల తొలగింపునకు కుట్ర
- బంగాల్‌లో ఆ విధంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది
- పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : పశ్చిమ బంగాల్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహిం చారు. బంగాల్‌లో సెక్యులర్ ఓట్లను తొలగించే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. సర్ పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించారని, తిరిగి 30 లక్షల ఓట్లు చేర్చారని పేర్కొన్నారు.
ఇంకా 60 లక్షల ఓటర్లు తమ ఆధార్ కార్డులు చూపించినా వారిని ఓటరు జాబితాలో నమోదు చేయలేదన్నారు. అక్కడ బీజేపీ 30 లక్షల ఓట్ల మెజార్టీనే సాధించిందని, తొలగించిన ఓట్లు 60 లక్షలు ఉన్నాయన్నారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వకుండానే వెళ్లిపోయారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటిని పొదుపుగా వాడుకోవాలని, బం గారం కొనుగోలు చేయవద్దని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మహేష్‌కుమార్ గౌడ్ స్పం దిస్తూ.. మోదీకి పొదుపు మంత్రం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చా రని, కానీ కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ మాట్లాడే భాష చెత్తగా ఉందని, బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్షమే లేకుండా కేసీఆర్ చేశారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ ఓర్చుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి తెలంగాణ లో పోటీ చేసినా ఇబ్బంది లేదని, 70 శాతం ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
దేశంలో కమ్యూనిస్టులు లేరనుకుం టే పొరపాటని, ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమకా రులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్‌గా సంతోషం గా, గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో గతం కంటే పంటల ఉత్పత్తి 20 శాతం పెరిగిందని, కొనుగోళ్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి నికార్సైనా కాంగ్రెస్ లీడరని పీసీసీ చీఫ్ కొనియాడారు.






