14 May, 2026 | 2:05 AM

లీకేజ్ కేంద్రం వైఫల్యమే

14-05-2026 01:09 AM
  1. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ 
  2. లోక్ భవన్ వద్ద ధర్నా 

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. నీట్ పేపర్ లీక్ దేశ వ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నీట్ యూజీ పరీక్ష రద్దుపై లోక్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహ ణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలమైందని, లక్షలాది మంది విద్యార్థులు రాత్రి పగ లు కష్టపడి చదివితే వారికి దక్కింది పేపర్ లీక్ లే అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ డ బుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2021లో, 2024లో నీట్ పరీక్ష పత్రం లీక్ అయిన దాని నుంచి ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతం అయిందన్నారు.

2024లో నీట్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కే రాధాకృష్ణన్ కమిటీని నియమించిందని, రాధాకృష్ణన్ కమిటీ నీట్ పరీక్షని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని చెప్పినప్పటికీ కేంద్రం ఆ కమిటీ సిఫార్సులను అమ లు చేయకపోతే ఆ కమిటీ ఎందుకు వేశారు అని ప్రశ్నించారు. వేలకోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికే రాధాకృష్ణన్ కమి టీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.

పేపర్ లీక్‌పై నైతికంగా బాధ్యత వహిస్తూ ఎన్టీఎ డైరెక్టర్ జన రల్ అభిషేక్ సింగ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ప్రశ్నా పత్రం లీక్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.