calender_icon.png 20 February, 2026 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ జీవితం ఆదర్శప్రాయం

20-02-2026 12:47:29 AM

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 

చండూరు, ఫిబ్రవరి 19: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని సుందరయ్య కాలనీ యూత్ నాయకులు  అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతినిపురస్కరించుకొని.. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోశివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ, శివాజీ  తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.

శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రభుత్వం ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలని, అలాగే చత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మొగలుల అరాచకాలు, పైశాచికత్వం నుంచి ప్రజలను విముక్తి కల్పించాలనే లక్ష్యంతో హిందూ రాజస్థాపన కోసం పోరాడిన మహాయోధుడు చత్రపతి శివాజీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రావుల మల్లయ్య, నాగిళ్ల లక్ష్మణ్, బురుకల రాజు, కట్ట నిశాంత్, బురుకల సైదులు, అయితగోని మహేష్, నారపాక శివ, నరపాక స్వామి, నారపాక సాయి, కొత్తపల్లి అనిల్ పాల్గొన్నారు.

పాలకవీడులో

పాలకవీడు, ఫిబ్రవరి 19: శివాజీ మహారాజ్ యువజన సంఘం నేతృత్వంలో జరిగిన శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ యువజన నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాలకీడు సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ లక్ష్మి సత్యం, యువజన నాయకులు, శ్రీను, హనుమంతరావు, సత్యం, సురే ష్, రాజేష్, వీరయ్య, అన్వేష్, నవీన్, చంటి, సందీప్, సతీష్, వీరబాబు, కమల్, శిధర్, వే ణు, నారి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం 

గరిడేపల్లి ఫిబ్రవరి 19, (విజయ క్రాంతి): భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పౌరుషాలకు నిలువెత్తు ప్రతిరూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని గరిడేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు.మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం అంబేద్కర్ యూత్ అధ్యక్షులు అమరారపు శివాజీ,బండారు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ.మొగల్ సామ్రాజ్యవాదుల ఆగడాలను అరికట్టి మరాటి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బహుజన విప్లవ వీరుడు అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో ఎస్.కె చాంద్ మియా, పిడమర్తి హుస్సేన్, ఈశ్వర్, తేజ, వినయ్, సమీర్, నాగుల్, సలీం తదితరులు పాల్గొన్నారు.