calender_icon.png 20 February, 2026 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్మూర్తి మృతి పార్టీకి తీరని లోటు

20-02-2026 12:48:50 AM

మోతె, ఫిబ్రవరి 19 : ధరావత్ రామ్మూర్తి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మండల పరిధిలోని బురకచర్ల గ్రామానికి చెందిన ధరావత్ రామ్మూర్తి(55) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి భౌతిక కాయంపై  అరుణ పతాకాన్ని కప్పి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ  నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ధరావత్ రామ్మూర్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. 

సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో  ఇళ్ల స్థలాల పోరాటం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కొండ భాస్కర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, సిపిఎం గ్రామ సహాయ కార్యదర్శి చెరుకు శ్రీను,నాయకులు కొండా రాములు, పల్లె మరియమ్మ, ములకలపల్లి అశోక్, మక్కా అచ్చయ్య, రామచంద్రు, వాడగల సామ్రాజ్యం, సాలెమ్మ తదితరులు పాల్గొన్నారు.