calender_icon.png 20 February, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి

20-02-2026 12:45:38 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, ఫిబ్రవరి 19 : యాంత్రీకరణ పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ సంచాలక కార్యాలయంలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే యంత్ర పనిముట్లను రైతులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో  రైతులను ఏమాత్రం మేలు జరగలేదన్నారు.

కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగానే రైతులకు యాంత్రికరణ పనిముట్లు సుమారు రూ. 1.11 కోట్ల విలువగల పనిముట్లు అందజేసినట్లు తెలిపారు. ఫార్మర్ రిజిస్టర్, యూరియా యాప్ కూడా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారి అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు.

రైతుల కోసం అధిక నిధులు కేటాయిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పక వారు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు,మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, మల్లేష్, మామ్ సింగ్ ,అజయ్ కుమార్ ,అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.