20-02-2026 12:16:22 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్/సికింద్రాబాద్/ఖైరతాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనం గా ఉత్సవాలను నిర్వహించారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లోని మెహఫీల్ హోటల్ ఎదుట, షేక్ పేట్ చౌరస్తా, బోరబండలోని భరత్ నగర్, యూసుఫ్ గూడలోని ఎల్‌ఎన్. నగర్లలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని శివాజీ మహారాజ్ కు నీరాజనాలు అర్పించారు.
విద్యార్థులు, యువతకు శివాజీ జీవితం ఆదర్శం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): హిందూ ధర్మ సంరక్షణలో ఛత్రపతి శివాజీ స్పూర్తితో యువత ముందుకు సాగా లి అన్ని శుక్లాచార్య,దానం సుధాకర్, ట్రస్ట్ ప్రెసిడెంట్ పోలా బాబురావు స్పష్టం చేశారు. న్యూ బోయిన్‌పల్లి ఒకటో వార్డులోనేతాజీ ఫ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 397 వ జయం తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శుక్లాచార్య,దానం సుధాకర్, ట్రస్ట్ ప్రెసిడెంట్ పోలా బాబురావు హాజరై భారత్ మాత,చత్రపతి శివాజీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులుఅర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, సుధా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శివాజీ నిజమైన బహుజన చక్రవర్తి..
ఖైరతాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక వర్గానికి చెందినవారు కాదని ఆయన నిజమైన బహుజన చక్రవర్తి’ అని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే.పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని డౌన్ టౌన్ మాల్లో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన జరిగిన శివాజీ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు, బీసీ సమాజ్ ప్రతినిధులు మోడల శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుడు శివాజీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరా ట యోధుడు అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నా రు. గురువారం కంటోన్మెంట్ గ్రౌండ్ లో స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 396వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ముందుగా జంపన శివాజీ చిత్ర పటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శేషీ రాజ్ యాదవ్, ప్రకాష్, దాదా రావ్,జిత్తు, కృష్ణ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.