calender_icon.png 20 February, 2026 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాగ్‌లింగంపల్లిలో ఆక్రమణల తొలగింపు

20-02-2026 12:14:38 AM

  1. జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు
  2. ఆక్రమణల పేరిట పేదల బతుకులను కూల్చొద్దు
  3. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్

ముషీరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం రామ్ నగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలో చిరు వ్యాపారులు రోడ్డు, ఫుట్ పాత్‌లను ఆక్రమించి ఏర్పా టు చేసిన ఆక్రమనలను గురువారం  జీహెచ్‌ఎంసి, హైడ్రా అధికారులు  తొలగించారు. హైడ్రా, జీహెచ్‌ఎసీ అధికారులు పర్యవే క్షణలో సిబ్బంది రోడ్ల ఫుట్పాత్‌లను ఆక్రమించి నిర్మించిన షెడ్లను స్టాల్స్‌ను జేసీబీ సహాయంతో తొలగించారు.

బాగ్లింగంపల్లి ప్రధాన రోడ్డు, సుందరయ్య పార్క్ ముందు, అంబేద్కర్ కళాశాల సమీపంలో, సాయిబాబా దేవా లయం, వద్ద తదితర ప్రాంతాల్లో ఆక్రమనలను తొలగించారు. హౌసింగ్ బోర్డు సంబం ధించిన భవనాల్లో పార్కింగ్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసి షెడ్లను కూడా తొలగించారు.

ముందుస్తు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారని వ్యాపారుస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానిం గ్ ఏసీపీ సాయిబాబా, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మల్లేశం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు పర్యవేక్షణలో ఆక్రమనల తొలగింపు కొనసాగాయి.

ఆక్రమణల పేరిట పేదల బతుకులను కూల్చొద్దు

బాగ్‌లింగంపల్లి సుందరయ్య పారువద్ద పుట్ పాత్ పై దుఖానాలను జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాల పేరుతో చిరు వ్యాపారులు చేసుకునే వారి దుకాణాలు కూల్చివేయడం దారుణమని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిరు వ్యాపారం చేసుకునే వారి దుకాణాలు ఆకారణంగా కూల్చి వేయడం మూలంగా చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టే చర్యలను జీహెచ్‌ఎంసీ, హైడ్రా అదికారులు మాను కోవాలన్నారు.