24 లోపు యాప్‌లో నమోదు చేయాలి
ఓటర్ల నమోదు అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం
వనపర్తి, జూలై 5 (విజయక్రాంతి): పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడువు జూలై 24 లోపు బి.ఎల్. ఓ యాప్ లో నమోదు చేయాలని ఓటర్ల నమోదు అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఆదివారం వనపర్తి మున్సిపాలిటి పరిదిలోని గాంధినగర్, హరిజన్ వాడ, నాగవరంలో గల పోలింగ్ స్టేషన్ సంఖ్య 120,122,123,160 మరియు 170 లలో పర్యటించి ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
బూత్ లెవల్ అధికారులు, పర్యవేక్షకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులు మరియు బూత్ లెవల్ పర్యవేక్షకులు గణన ఫారం ఓటర్లుకు పంపిణి మరియు గణన ఫారం పూరించే విధానము పరిశీలించి బూత్ స్థాయి అధికారులకు, పర్యవేక్షకులకు పలు సూచనలు చేసారు, ఓటర్ చేత ఎన్యూమరేషన్ ఫారం తప్పులు లేకుండా పూరించి అట్టి ఫారంను ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన గడువు లోపల బి.ఎల్. ఒ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అదే విదముగా ఓటర్లతో మాట్లాడి ఫారం నింపడంలో వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారంను ఖచ్చితంగా తిరిగి బూత్ లెవల్ ఆఫీసర్లకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని అవగాహన కల్పించారు. బూత్ లెవల్ అధికారులు, ఏజెంట్లు, తదితరులు ఆర్డీఓ వెంట ఉన్నారు.






