సమస్యలకు నిలయంగా అంగన్వాడీలు
- స్వంత గదులకు నోచుకోని అంగన్వాడీ కేంద్రాలు
- ఒకే గదిలో కేంద్రల నిర్వహణ
- గదుల కొరతతో పిల్లలకు రక్షణ కరువు
- టీచర్లకు భారంగా కేంద్రాల నిర్వహణ
మెట్ పల్లి, జూలై 5(విజయక్రాంతి):మెట్ పల్లి సమగ్ర శిశు అభివృద్ధి సేవ కార్యాలయ (ప్రాజెక్ట్) పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయం గా మారాయి. ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు స్వంత గదులు లేక కేంద్రాలు అల్లాడిపోతున్నాయి. ఇరుకుగా ఉండే అద్దె గదుల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ టీచర్లకు కత్తిమీద సా మూల మారింది.
భర్తీకి నోచుకోని ఖాళీలు
మెట్ పల్లి ప్రాజెక్ట్ పరిధిలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ ఐదు మండలాలు ఉన్నాయి. ఆ యా మండలాలో మొత్తం 312 అంగన్వాడీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. మెట్ పల్లి ప్రాజెక్ట్ పరిధిలో 14 మంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా సహాయకుల పోస్టులు 106 ఖాళీగా ఉన్నాయి.దింతో ఆయా కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
గర్భిణులు బాలింతాలకు ప్రత్యేక సేవలు
ప్రాజెక్ట్ పరిధిలో 26412మంది లబ్ధిదారులు ఆయా మండలాల పరిధిలోని అంగ న్వాడీ కేంద్రాల ద్వారా సేవలు పొందుతున్నారు. వారిలో గర్భిణీ లు 2214మంది, బాలింతాలు 1425 మంది, 0నుండి ఆరు నెలల పిల్లలు 1444 మంది, ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలు 106 65మంది, మూడు సంవత్సరాలనుండి ఆ రు సంవత్సరాల పిల్లలు 10664 మంది అ ంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులు ఉన్నారు. ప్రాజెక్ట్ పరిధిలో ప్రతి రోజు గర్భిణులు, బాలింతాలకు ప్రత్యేక బలవర్ధక ఆహారాన్ని అందుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలకు లక్షల విలువ చేసే సామాగ్రి అందిస్తున్నాయి. నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతాలు విధిగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది.
జాడలేని స్వంత భవనాలు
ప్రాజెక్ట్ పరిధిలో 312 అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు కేవలం 51 కేంద్రా లకు మాత్రమే ఉన్నాయి.188 అంగన్వాడీ కేంద్రాలు అద్దె గదుల్లో నిర్వహిస్తుండగా గ్రా మపంచాయతీ, ప్రభుత్వ పాఠశాలలో రెంట్ ఫ్రీ గా 73 కేంద్రాలు నడుస్తున్నాయి. అత్యధిక అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే ఒక్క గదిలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా రెండు గదుల్లో నిర్వహణ చేపట్టాలి.కాని గ్రామీణ ప్రాంతాల్లో అద్దె గదుల కొరత వేదిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఎక్కువ ఉండడం అంగన్వాడీ టీచర్లకు ఆర్థిక భారం గా మారింది.కాని ఒక్క గదిలోనే పిల్లలకు విద్య అందిస్తూ, అదే గదిలో వంట చేస్తున్నారు.
దింతో పిల్లలకు ప్రమాదం జరిగే అ వకాశం ఉంది.ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిధిలో పదకొండు అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు మంజూరు కాగా వాటిలో ఐదు అంగన్వాడీ కేంద్రాలు పూర్తి కాగా మరో ఐదు స్లాబ్ వరకు పనులు అయ్యాయి. ఇక ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఒక కేం ద్రం లో మాత్రం స్థలం కొరతతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అధికారులు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో నె లకొన్న సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రాజెక్ట్ పరిధిలో సమస్యలపై దృష్టి సారించాను కొత్తగా బదిలీపై వచ్చాను. ప్రాజెక్ట్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. పెద్ద సమస్యలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
మెట్ పల్లి సిడిపిఓ తాళ్ల పద్మ అనిల్






