ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ విషయంలో శ్రద్ధ వహించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు బిజెపి నాయకులతో, కార్యకర్తలతో కలిసి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ... ఎస్ఐఆర్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలలో బిఎల్ఎటుగా కార్యకర్తలను నియమించడం జరిగింది.
వీరు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రజలకు సహకరించడం జరుగుతుందన్నారు. అలాగే చనిపోయినటువంటి వారి యొక్క ఓటును తొలగింపు, నూతనంగా వివాహమైనటువంటి స్త్రీల ఓటును చేర్చే విధానంలో కార్యకర్తలు అందరూ శ్రద్ధ వహించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ విషయంలో శ్రద్ధ వహించి ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అధికారులకు సహకరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా చేయవలసిందిగా కార్యకర్తలకు,నాగిరెడ్డిపేట మండల ప్రజల కోరడం జరిగింది.






