సుల్తానాబాద్‌లో ముందస్తుగా బీఆర్‌ఎస్ నాయకులు అరెస్ట్
06-07-2026 12:23 AM
సుల్తానాబాద్, జులై 5 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌజ్ పంపులను ఆన్ చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా పంప్ హౌజ్ సందర్శనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతున్న సందర్బంగా కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్లకుండా ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ బోయిని రాజ మల్లయ్య, బిఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పారుపల్లి గుణపతి, మాజీఎంపీటీసీసూరశ్యామ్ ,యూత్ వైస్ ప్రెసిడెంట్ గాజుల అరుణ్ కుమార్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు...






