6 July, 2026 | 1:00 AM

అక్రమ వ్యాపారాలు ఆగేనా?

05-07-2026 11:59 PM
  1. మామూళ్ల మత్తులో అధికారులు 
  2. ఆఫ్‌లైన్‌లో ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకొని వైనం 
  3. మైనింగ్, ఫుడ్ సేఫ్టీ అధికారులూ.. మీ చిరునామా ఎక్కడ? 
  4. మక్తల్ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా 
  5. అధికార పార్టీ నాయకుడి అండ దండలతోనే.. 
  6. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికార పార్టీ నేత!

నారాయణపేట జిల్లాలో జిల్లా ఎస్పీ బదిలీపై రాగానే అక్రమ వ్యాపారాలు పై ఉక్కు పాదం మోపారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే. తర్వాత అంతా మళ్ళీ యదా స్థాయిలో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. బదిలీపై వచ్చి న తొలి నాళ్లలో అక్రమ ఇసుక రవాణా, ఎర్రమట్టి రవాణా బియ్యం రవాణా, బెల్ట్ షాపులు నిర్వహణ చేద్దామంటేనే భయపడే వ్యాపారులు ప్రస్తుతం జిల్లాలో యథేచ్ఛగా నడుస్తున్నాయి.

నారాయణపేట, జూలై 5 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి ముఖ్యంగా, అక్రమ బెల్ట్ షాపులు,ఇసుక , ఎర్రమట్టి, బియ్యం, గుట్కా, కల్తీ నూనె, తదితర వ్యాపారాలు జోరుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కోన సాగుతున్నాయి.. ఇన్ని అక్ర మ వ్యాపారాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు, సంబంధిత అధికారులు మా త్రం పట్టించుకున్న పాపాన పోలేదు.

జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో ఓ రాజకీయ నాయకుడి అండ దండలతో ఇసుక రవాణా జోరుగా సాగుతున్న పట్టించుకోవాల్సిన పోలీసు అధికారులు రాజకీయ వత్తిళ్ళతో అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఇ సుక కొరత ఉందంటూ ఆఫ్ లైన్లో మాత్రం యథేచ్ఛగా రవాణా చేస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం ఏమి తెలియనట్లు చూసి చూడనట్లు ఉంటున్నారనిప్రతిపక్ష నాయకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ నాయ కులు రామమోహన్ రెడ్డి రీచ్ ల్లోకి వెళ్లి అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ లైన్లో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు సైతం ఒక వేళ టాస్క్ ఫోర్స్ అధికారు లకు చిక్కితే వారు వెంటనే సంబంధిత పో లీసు స్టేషన్ కు తరలించి చేతులు దులుపుకొంటారు.

ఆ వెంటనే సంబంధిత ఇసుక మాఫియా లీడర్లు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు ఒక గంటలోనే మామూ ళ్లు తీసుకొని తక్కువ మొత్తంలోనే జరిమానా విధిస్తూ వాహనాలను వదిలిపెడుతు న్నారు. కానీ వాహన యాజమానుల మీద కేసులు నమోదు చేస్తున్న అధికారులు మా త్రం అదే ఇసుక రీచ్ యజమానులపై కేసు లు నమోదు చేయకుండా లేదంటే రీచ్ యా జమానుల మీద బ్లాక్ లిస్టులో ఎందుకు పె ట్టటం లేదని అధికారులమీద విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 

బియ్యం రవాణా: 

జిల్లాలో పీడీఎస్ బియ్యం రేషన్ డీలర్లు దగ్గర బియ్యం వ్యాపారులు ఏజెంట్లను నియమించుకుని మక్తల్, నర్వ, మరికల్ ధన్వాడ ఉట్కూరు దామరగిద్ద, మద్దూరు, కోస్గి, మండలాల కేంద్రంగా వ్యాపారం చే స్తూ సమీప రైస్ మిల్లులకు తరలిస్తూ సొ మ్ము చేసుకొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున బియ్యం వ్యాపారం జరుగుతున్న ఏ మాత్రం సంబంధిత రైస్ మిల్లులపై సంబంధిత అధికారులు  దాడులు  ఎందుకు చేయటం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

బెల్ట్ షాపుల జోరు: 

జిల్లాలో బెల్ట్ షాపులు రోడ్డుకు ఇరువైపుల డాబాలు వెలిసిన అబ్కారీ అధికారులు, పోలీసు అధికారులు పట్టించు కొన్న పాపాన పోలేదు అంటూ విమర్శలు సైతం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా పట్టణ కేంద్రంలో వార్డుల్లో అనధికారింగా బెల్ట్ షాపులు నడుస్తున్న సంగతి విధితమే. జిల్లాకు కొత్తగా వచ్చిన సమయంలో ఎస్పీ గట్టి చర్యలు తీసుకొన్న సంగతి తెలిసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ రాను రాను ఎస్పీ డాబాలు, మీద నియంత్రణ కోల్పోయారని ప్రజలు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

కల్తీ నూనె తయారీ విషయంలో కూడా గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు పేట జిల్లా కేంద్రంగా ఓ ట్రాన్స్పోర్ట్ నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తున్న సందర్భంగా పట్టుకొన్న సంగతి విధితమే. ఇదే ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్ నుంచి పేటకు కల్తీ నూనె సరఫరా చేస్తూ కోట్లు కూడబెట్టుకుంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఇక నైనా పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఎర్రమట్టి రవాణా: 

జిల్లాలో ధన్వాడ, మరికల్, మక్తల్,దామరగిద్ద, కోస్గి మండలాల పరిధిలో యథేచ్ఛగా ఎర్రమట్టి రవాణా జరుగుతున్న పట్టించు కొని అధికారులు జిల్లా కేంద్రంలో ప్రభుత్వానికి డిడి ల రూపంలో ఒక్క ట్రిప్పుకు 1300 రూపాయలు చెల్లిస్తామని అంటే స్తానిక తహసీల్దార్ మాత్రం కలెక్టర్ అనుమతులు లేనందున నేను అనుమతులు ఇవ్వలేనని స్తానిక తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ కొంత మంది కి తెలిపారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్లు చూడాలని ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వం ఆదాయము కోల్పోవటం కాకుండా జీరో ద్వారా ఇసుక రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టీ అరికట్టాల్సిన అవసరం  ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు