6 July, 2026 | 2:18 AM

13న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి

06-07-2026 01:19 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం

పాల్వంచ, జులై 5 (విజయక్రాంతి):  పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని యూరియా యాప్ ఎత్తివేయాలని  తదితర రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS ) ఆధ్వర్యంలో  ఈనెల 13వ తేదీన  జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు రైతులు వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై  జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి  sk సాబీర్ పాష, ఏఐకేఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథంలో పిలుపునిచ్చారు.

స్థానిక సిపిఐ కార్యాలయం చండ్ర రాజేశ్వరరావు భవన్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు చంద్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన  ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా తీసుకొస్తూ  రైతాంగానికి గొడ్డలి పెట్టు ల వ్యవహరిస్తున్నాదని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక రైతాంగాన్ని  అయ్యో మాయానికి గురి చేస్తున్నదని ఎకరానికి రూ15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి తీరా రూ 6,000లకు కుదించి సకాలంలో అందించకపోవడంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. రూ 2 లక్షల రుణమాఫీ పూర్తి  స్థాయిలో అమలు చేయాలని, రైతులకు గుదిబండగా మారిన యూరియా యాప్ ను ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో విక్రయాలకు అనుమతి ఇవ్వాలన్నారు.

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఈ నెల  13వ తేదీన తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడికి  రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాసరావు,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీసం శెట్టి పూర్ణచందర్రావు, ఉప్పు శెట్టి రాహుల్ తదితర జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.