5 July, 2026 | 7:31 PM

సొంత గ్రామంలో జడల సురేందర్‌కు ఘన సన్మానం

05-07-2026 06:22 PM

ముత్తారం,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దపల్లి జిల్లా 23వ వార్డు కౌన్సిలర్ జడల సురేందర్‌కు ఆయన సొంత గ్రామమైన రామకృష్ణాపూర్ (ఇప్పలపల్లి)లో ఘన సన్మానం నిర్వహించారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి జడల సురేందర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణకు జడల సురేందర్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో మున్నూరు కాపు సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.