ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని 24 గుంటల భూవివాదం
నాగిరెడ్డిపేట్ పోలీసుల చోరవతో పరిష్కారం
నాగిరెడ్డిపేట్, జులై 5 (విజయక్రాంతి): ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ 24 గుంటల భూ వివాదాన్ని నాగిరెడ్డిపేట్ పోలీసుల చోరవతో శాశ్వత పరిష్కారం అయినట్లు స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.
స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బంజర తండ గ్రామ పరిధిలోని 24 గుంటల భూమి విషయంలో మాన్ సింగ్, శ్రీను, లింబ్యాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదం గ్రామంలో తరచు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసేది.భూమి హద్దుల విషయంలో పలుమార్లు సంఘర్షణలు చోటు చేసుకోగా, గ్రామ పెద్దలు నిర్వహించిన పంచాయితీలు కూడా సమస్యను పరిష్కరించలేకపోయాయని, ఈ భూవివాదం కారణంగా మాన్ సింగ్, శ్రీను పరస్పరం దాడులకు పాల్పడి జై లుకు కూడా వెళ్లి వచ్చారని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.ఈ భూవివాదం భవిష్యత్తులో శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని, ముందస్తుగానే గుర్తించిన నాగిరెడ్డిపేట్ మండల పోలీసులు చొరవ తీసుకొని ఇరు పక్షాలతో పలుమార్లు చర్చలు నిర్వహించి ఓర్పుతో కౌన్సిలింగ్ చేసి, పరస్పర అంగీకారంతో వివాదానికి ముగింపు పలికారు.
ఎన్నో సంవత్సరాలుగా ఎవరు పరిష్కారం చేయలేకపోయినా ఈక్లిష్టమైన భూవివాదానికి ఆదివారం నాగిరెడ్డిపేట్ పోలీసులు సమయోచిత జోక్యంతో శాశ్వత పరిష్కారం లభించిందనీ ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. దీనితో గ్రామంలో శాంతి నెలకొనడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుని సఖ్యతతో జీవించాలని అంగీకరించారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని మేలుకోల్పోడమే పోలీసుల లక్ష్యమని అనే మాటను నాగిరెడ్డి పేట పోలీసులు మరోసారి ఆచరణలో నిరూపించారని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.






