6 July, 2026 | 1:19 AM

పుష్కరాల నాటికి ఆలయాలకు ప్రత్యేక శోభ

06-07-2026 12:21 AM
  1. ముఖ్యమంత్రి ముందుచూపుతో పుష్కర పనులు..
  2. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వెల్గటూర్, జూలై5(విజయక్రాంతి): గోదావరి పుష్కరాలకు ముందే గోదావరి తీ రంలోని ఆలయాలకు కొత్త శోభ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగు తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారని అన్నారు.గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్లు వివరించారు.పుష్కర ఘాట్ నిర్మా ణానికి 8 కోట్లు కోటిలింగాల నుండి పాశీ గాం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించగా వెల్గటూర్ నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ కొరకు రూ. 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.