రాజీవ్ రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించండి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుచున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి సమీపంలో రాజీవ్ రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత వర్షాకాలం దృశ్య భారీ ఈదురు గాలులు, వర్షాలు పడుతున్న తరుణంలో రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల కొమ్మలు విరిగి పడే ప్రమాదం ఉంది.
భారీ వర్షాలు, ఈదురు గాలుల సమయంలో బస్సులపై చెట్లు కూలి పడిన, కొమ్మలు పడిన తీవ్ర నష్టం వాటిల్లుతుంది, నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తుంటాయి, సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగక ముందే, ప్రమాదకరంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మల ను తొలగించి, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






