31 August, 2026 | 10:37 AM

Breaking News

జోగులాంబ అమ్మవారి సన్నిధిలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు   •   నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •  

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

06-07-2026 01:19 AM

వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

బోధన్, జూలై 5 (విజయక్రాంతి): బోధన్ డివిజన్ కేంద్రంలోని పిఆర్ టి యు భవనంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎఐఎస్ ఎప్ జిల్లా కార్యదర్శి బోడ. అనిల్, పిడిఎఫ్ యు జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్ కుమార్ లు మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ ఎప్  బోధన్ డివిజన్ ఇంచార్జ్ విశాల్ దేవ్, పిడిఎఫ్ యు  జిల్లా కార్యదర్శి అనిల్, ఎస్ ఎఫ్ ఐ  నాయకులు విశాల్, ఎఐఎప్ డి ఎస్ జిల్లా కన్వీనర్ మోసిన్, పిడిఎఫ్ యు, కే..సాయినాథ్, ఇతర సంఘాల నాయకులు జి.కిషోర్, శంకర్ సతీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు