18 April, 2026 | 5:44 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో

18-04-2026 04:19 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను మండల ఇంచార్జ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.అలాగే అంగన్వాడీ కేంద్రంను,నర్సరీలను కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి లబ్ధి పొందాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే జీవితాంతం గుర్తుండి పోతుందని తెలిపారు.

గతంలో ఇందిరాగాంధీ,వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయనీ,మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు.గ్రామాల్లో ఇంకా ప్రారంభించని వారు ఉంటే త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు.అలాగే నర్సరీలో ఉన్న మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని వేసవికాలం సందర్భంగా మొక్కలకు నీటి సమస్య తలెత్తకుండా సరిపడా నీటిని అందించాలని అన్నారు.అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు మెనూ ప్రకారం మంచి బలమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించకుండా బాధ్యతగా వ్యవహరించి మంచి విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ ఫర్విన్ బేగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.