18 April, 2026 | 5:38 PM

ఇళ్ళ గణన పకడ్బందిగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ హరిత

18-04-2026 04:17 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారo జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాల, కళాశాలలో ఆసిఫాబాద్ మండలంకు చెందిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరేడ్డితో  కలిసి కలెక్టర్ హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జనాభ గణన-2027 లో భాగంగా మెదటి విడత ఇళ్ళ గణన కార్యక్రమము వచ్చే నెల 11 నుండి జిల్లాలో ప్రారంభమవుతుందని ఎన్యుమరేటర్లు,సూపర్ వైజర్లు ఇళ్ళ గణన కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలని అన్నారు.

ఇళ్ళ గణన సమయంలో ఇంటి యజమానికి 32 ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవలసి ఉంటుందని పూర్తిగా డిజిటల్ పద్దతిలో ఇళ్ళ గణన ఉంటుందని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇళ్ళ గణన కార్యక్రమము చేపట్టాలన్నారు. శిక్షకులు చెప్పే ప్రతి అంశమును శ్రద్దగా విని నోట్ చేసుకోవాలన్నారు. ఏదైనా అంశము అర్ధం కాకపోతే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇళ్ళ గణన కొరకు 994 మంది ఎన్యుమరేటర్లు 174 మంది సూపర్ వైజర్లు, విధులు నిర్వహిస్తున్నారని విరే కాకుండా చార్జ్ అధికారులు, అడిషనల్ చార్జ్ అధికారులు, కంప్యుటర్ ఆపరేటర్లు, విధులు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో 1689 హౌస్ లిస్టింగ్ బ్లాక్ గా గుర్తించడం జరిగిందన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇళ్ళ గణన ప్రక్రియను చేపట్టాలన్నారు.