18 April, 2026 | 5:54 PM

మహిళా బిల్లును అడ్డుకోవడం తగదు

18-04-2026 04:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): మహిళలకు చట్టసభలో 33 శాతం బిల్లు అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని నిర్మల్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ రావుల రమ్య అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాన పార్టీలు మహిళా బిల్లు విషయంలో అడ్డుకోవడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. పార్లమెంటులో జరిగిన మహిళా బిల్లుపై కాంగ్రెస్ బిఆర్ఎస్  పార్టీలు మహిళల పట్ల ఉన్న ద్వేశాన్ని బయట పెట్టడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల పట్ల దీక్షతో పనిచేస్తూ డీలిమిటేషన్ ద్వారా దేశంలో  పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచి  మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి అవకాశం తీసుకువస్తే కుట్రతో ఆ బిల్లును కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో ఓడించి మహిళలకు తీరని అన్యాయం చేయడం జరిగింది.

ఈ బిల్లు వీగిపోవడంతో పార్టీలు ఏం సాధించాయని ప్రశ్నించడం జరుగుతున్నది. 2023లో ఈ బిల్లుకు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఇప్పుడు అనేక కారణాలు చూపిస్తూ బిల్లును అడ్డుకోవడం జరుగుతున్నది. మహిళలు రాజ్యాధికారం చేయడం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఇష్టం లేదు. ఇది ఆ పార్టీలకు అలవాటుగా మారింది. గతంలో షాబానో కేసు త్రిబుల్ తలాక్ వంటి విషయాలలో కూడా మహిళలకు ఇదే రకంగా అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు మహిళలు తగిన గుణపాఠం చెప్పి మహిళా శక్తిని చాటాలని మహిళలు మోడీ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరడం జరుగుతున్నది.