గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
18-03-2026 06:45 PM
3.6 కేజీల గంజాయి స్వాధీనం
తాండూరు,(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ రాణి చెప్పిన వివరాల ప్రకారం లో బుధవారం తాండూర్ మండలం గౌతాపూర్ అజ్వ స్టోన్ ఫ్యాక్టరీ వద్ద తనిఖీలు చేయగా బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన ముస్తకిం అనే వ్యక్తి దగ్గర 3.6 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అమ్మడం, కలిగి ఉండటం చట్ట రీత్యా నేరమని .. ఎక్కడైనా. .ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిస్తే ఎక్సైజ్ పోలీసుల ఫోన్ నెంబర్ 8712658754 కు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.




