18 March, 2026 | 10:08 PM

చేసిన పనులకు నిధులు చెల్లించాలి

18-03-2026 06:48 PM

- పొనుగోడు మాజీ సర్పంచ్ జోగు సరోజనమ్మ

గరిడేపల్లి,(విజయక్రాంతి): చేసిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత సర్పంచ్,పంచాయతీ కార్యదర్శులు బిల్లులు చెల్లించడం లేదని పొనుగోడు మాజీ సర్పంచ్ జోగు సరోజనమ్మ తెలిపారు.బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను సర్పంచిగా పనిచేసిన కాలంలో చేసిన పనులకు ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో వాటిని చెల్లించేందుకు ప్రస్తుత నూతన సర్పంచి, పంచాయతీ కార్యదర్శులు నిరాకరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

2022-23 సంవత్సరంలో ఎం జి ఎన్ ఆర్ ఇ జి ఎస్ పథకం కింద గ్రామపంచాయతీ నూతన భవనానికి నిధులు మంజూరు కావడంతో పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యాలయం నూతన భవనం పూర్తి కావడంతో మొదటి విడత కేంద్ర ప్రభుత్వం 13,28,428 రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు.సంబంధిత నిధులను మాజీ సర్పంచులకు చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిధులు చెల్లించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు సంవత్సరాలుగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాలేదని,

టైడ్, యునైటెడ్ గ్రాంట్ తో పాటు ఓచర్ల బిల్లులకు కూడా నిధులు చెల్లించాల్సి ఉందన్నారు.ప్రస్తుత ప్రభుత్వంలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన టైడ్,యునైటెడ్ గ్రాంట్ లకు 8, 83 వేల 633 రూపాయలు నిధులు విడుదలయ్యాయి అని తెలిపారు.దీంతోపాటు 2024-25 సంవత్సరానికి కూడా 18 లక్షల 57 వేల 484 రూపాయలు విడుదలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం 28,51,117 రూపాయలను విడుదల చేయగా పొనుగోడు గ్రామపంచాయతీ నందు జమ అయ్యాయని తెలిపారు.

చేసిన పనులకు సంబంధించిన అన్ని బిల్లులు అధికారులకు సమర్పించడం జరిగిందని తెలిపారు.పనులు పూర్తయి బిల్లులతో సహా అందించినట్లు తెలిపారు.మొత్తం చేసిన పనులకు 28 లక్షల పదమూడువేల527 రావాల్సి ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను చెల్లించడం లేదని తెలిపారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను చెల్లించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.