calender_icon.png 20 February, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహజ కాన్పు వల్ల అనేక ప్రయోజనాలు

20-02-2026 12:44:12 AM

జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి19:  సహజ కాన్పు వల్ల మహిళలకు అనేక ప్రయోజనాలు ఉంటాయని,ఆపరేషన్ నిర్వహించినట్లయితే వారికి అనేక అనర్థాలకు దారి తీస్తాయని జిల్లా ఉపవైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ అన్నారు.గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీలో గర్భిణీ స్త్రీ బిడ్డకు జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదు... జన్మించిన శిశువు చనిపోకూడదు..

అనే నినాదంతో సహజ కాన్పు కొరకు సామూహిక శ్రీమంతాలు జరిపారు.ఈ సందర్భంగా మండలంలోని 35మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు  నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సహజ కాన్పు కోసం అన్ని రకాల వసతులు కల్పించినట్లు చెప్పారు.సహజ కాన్పు వల్ల ఆర్థికంగా,శారీరకంగా,మానసికంగా మహిళలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసిద్ధ,డాక్టర్ నాజియా,మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్,ప్రోగ్రాం అధికారి ఉమ, సంజీవరెడ్డి, సీహెచ్‌ఓ బిచ్చునాయక్,సీడీపీఓ మంగ,సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్,బింగి కృష్ణమూర్తి,లూనావత్ కృష్ణనాయక్,సూపర్వైజర్ లలిత,అనిత,నర్సింగ్ ఆఫీసర్లు,ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు,గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.