ఐకెపి సెంటర్ లో రైతులకు మౌలిక వసతులు కరువు
తూప్రాన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంతో శుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో రైతులు పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ వడ్ల కొనుగోలు ప్రక్రియ ఈ క్రమంలో తూప్రాన్ మండల పరిధిలో ఐకెపి సెంటర్లను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో తూప్రాన్ మండలం యావపూర్ ఐకెపి సెంటర్ లో రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏవి కల్పించని ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా రైతులకు కావలసిన నీడనిచ్చే టెంట్ లేకపోవడం, కూర్చోవడానికి కుర్చీలు, తాగడానికి నీరు, ధాన్యం బస్తాలకు ప్రభుత్వం ఇచ్చే టాపర్లు లేకపోవడం విడ్డూరం.
దీనిపట్ల ఐకెపి అధికారులు ఎంత చిత్త శుద్ధితో పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కొన్నిచోట్ల ఏకంగా లారీలు సకాలంలో రాకపోవడం, లారీలు ఉన్న హమాలీలు లేకపోవడం, ఇలా అనేక ఇబ్బందులుతో రైతులు సతమతం అవుతుండగా దీనికి తోడు అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని దృష్ట్యా ఐకెపి అధికారులు రైతులకు కావలసిన మౌలిక వసతులతో పాటు లారీలను, హమాలీలను, కావలసిన టాపర్లను సకాలంలో సమ కూర్చాలని రైతులు వేడుకున్నారు.






