గగ్గుపల్లిలో మన ఊరు మన భద్రత
09-05-2026 07:54 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో అర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ అతిథిగా అర్మూర్ ఎస్సై యసీర్ అరఫత్ హాజరై గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, శీ టీమ్ తదితరులు పాల్గొన్నారు.






