8 May, 2026 | 1:32 AM

రామప్పను సందర్శించిన హైకోర్టు జడ్జి

08-05-2026 12:38 AM

వెంకటాపూర్, మే 7 (విజయక్రాంతి): మండలంలోని ప్రసిద్ది గాంచిన రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు జడ్జి వాకిటి రామకృష్ణారెడ్డి దంపతులు గురువారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్లు ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ మండపంలో ఈవో భాస్కర్ శాలువాతో సన్మానించగా, అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించారు. అనంతరం జడ్జి దంపతులు రామప్ప సరస్సును సందర్శించారు. వారి వెంట ఎస్త్స్ర చల్ల రాజు, ఆర్‌ఐ రమేష్, టూరిజం పోలీసులు బద్రు, శ్రీకాంత్తో పాటు కోర్టు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల అధికారులు, సిబ్బందిలు ఉన్నారు.