8 May, 2026 | 2:00 AM

12న నిర్వహించే టీజేఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలి

08-05-2026 12:39 AM

ఎమ్మెల్సీ కోదండరాం 

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీసీ రిజర్వేషన్లు నిరుద్యోగ సమస్య రైతాంగ, కార్మికుల సమస్య లపై రాష్ట్ర ప్లీనర్లో చర్చ  జరుగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గురువారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీ రోటరీ పార్కు లో ఏర్పాటుచేసిన కామారెడ్డి జిల్లా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈనెల 12న టి జి ఎస్ పార్టీ జలవిహార్ లో నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్ర ప్లినరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతంగా సమస్యలు, కార్మికుల సమస్యలు చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్లినరి ని విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు, రాబోయే రోజుల్లో కామారెడ్డి జిల్లలో సాగు నీరు కోసం కృషి చేద్దామన్నారు. ప్రాజెక్టు లు పూర్తి కావాలి రాబోయే రోజు లలో జిల్లాలో పర్యటించి  అభివృద్ధి కోసం కృషి చేద్దాం అని కలిసి రావాలని అన్నారు. జిల్లా ప్లీనరీ సమావేశంలో జిల్లా టీజేఎస్ పార్టీ కమిటీని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. జిల్లా టీజేఎస్ అధ్యక్షులు గా కుంబాల లక్ష్మణ్ యాదవ్,ప్రధాన కార్యదర్శి గా రజనీకాంత్,ఉపాధ్యక్షులు గా పూల్సింగ్, లాల్ సింగ్, కార్యదర్శి లు గా సంగరాజు,వర్షిత్, సంజీవ్, విజయ్ కుమార్, టీజేఎస్ జిల్లా మహిళా అధ్యక్షులు గా నాగరాణి, లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.