8 May, 2026 | 1:32 AM

పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయించాలని వినతి

08-05-2026 12:37 AM

ఫీజు బకాయల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోదండ రాముకు విజ్ఞప్తి

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మూడు సంవత్సరాల నుంచి రావడంలేదని పాత బకాయిలను ఇప్పించాలని టీజేఎస్ నాయకులు ఎమ్మెల్సీ కోదండరాం కు టి ఎన్ ఎస్ ఎఫ్, బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజేఎస్ జిల్లా ప్లీనరీకి ముఖ్య అతిథిగా హాజరైన కోదండ రాము ను వారు కలిసి విజ్ఞప్తి చేశారు.పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కోదండరాం కి విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఫీజు బకాయిలు రాకపోవడంతో అధ్యాపకులు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజుబకాయలు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వపై ఒత్తిడి తీసుకురావాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ఎమ్మెల్సీ కోదండరాం కు విజ్ఞప్తి చేశారు.మూడు సంవత్సరాల కు సంబంధించిన బకాయిలు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 

మిగిలిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి వివిధ రకాలైన కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు అధ్యాపకులకు యాజమాన్యాలకు న్యాయం చేయాలని ఈ విషయాన్ని వెంటనే సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసినందున టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. నూతన కామారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా నియామకమైన కుంభాల లక్ష్మణ్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సాఫ శివరాములు, నీలం నాగరాజు, మల్లన్న, తదితరులు పాల్గొన్నారు.